
ఆ షాపింగ్ మాల్ ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. జనం అంచనాలకు మించి రావడంతో ఏకంగా ఈవెంట్ నే రద్దు చేశారు. ఇంతకీ అంతగా జనం ఎందుకు వచ్చారు ? ఈవెంట్ ను ఎందుకు రద్దు చేశారు ? అనేది తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే..
తేదీ .. ఆగస్టు 11
సమయం.. రాత్రి 8 గంటలు
కేరళలోని కోజికోడ్ నగరంలో ఉన్న హైలైట్ మాల్ కు జనం రాక మొదలైంది. రాత్రి 8.59 గంటల సమయమయ్యే సరికి మాల్ మస్తుగా నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత పరిస్థితి ఏర్పడింది. వాళ్లంతా ఏదో ఉచిత ఆఫర్ కోసం ఇలా ఎగబడలేదు. మలయాళం సినిమా ‘థల్లుమాల’ ప్రమోషన్ ఈవెంట్ ను చూసేందుకు వచ్చారు. మాల్ కెపాసిటీకి మించి పోటెత్తిన ప్రేక్షక జనాన్ని చూసి.. ఈవెంట్ నిర్వాహకులు నిర్ణయం మార్చుకున్నారు. ఏకంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
#WATCH | Huge crowd gathers at the Hilite Mall in Kozhikode, Kerala where the promotion of an upcoming Malayalam movie titled, 'Thallumaala' was to be held. The promotional event was eventually canceled. (10.08) pic.twitter.com/49V4kSfMuw
— ANI (@ANI) August 11, 2022
దీంతో పోటాపోటీగా ఈ ప్రోగ్రామ్ ను తిలకించేందుకు వచ్చిన వారంతా నిరాశగా ఇళ్లకు వెళ్లిపోయారు. ఇవాళే (ఆగస్టు 12న) ‘థల్లుమాల’ మూవీ రిలీజ్ అయింది.ఇందులో టోవినో థామస్ హీరో. ఇక ఈ ఈవెంట్ రద్దు కావడంపై టోవినో థామస్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ‘నాపై అమితమైన ప్రేమను కురిపించిన కోజికోడ్ వాసులకు ధన్యవాదాలు. ఇంత భారీ ప్రేక్షకావళిని ఒకేచోట నేనెన్నడూ చూడలేదు’ అని ఆయన కామెంట్ పెట్టారు.