
టెక్నాలాజి పెరిగిందని సంతోషపడాలో లేకా ఆ టెక్నాలాజీతో జరుగుతున్న మోసాలను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కాషిమీరాకు చెందిన ఓ మహిళ తన పక్కింటి మహిళ నుంచి రూ.6 లక్షలకు పైగా మోసం చేసింది. ఫోన్ కాల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంగ గొంతుగా మాట్లాడి ఈ మోసానికి పాల్పడింది. నిందితురాలు రష్మీకర్ తన పక్కింటి మహిళను మోసం చేసి, పురుషుడిలా నటిస్తూ వివిధ వాయిదాల్లో రూ.6.6 లక్షలు చెల్లించాలని బెదిరించింది.
బాధితురాలు ఎప్పుడు కూడా ఆమెను కలవలేదు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డబ్బు చెల్లించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు విచారణ సందర్భంగా, తనకు అత్యవసరంగా డబ్బు అవసరం కావడంతో పక్కి్ంటి మహిళను మోసం చేయడానికి ఫోన్ కాల్ లో తన వాయిస్‌ని మార్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లుగా వెల్లడించింది. పోలీసులు ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.