అలరిస్తోన్న ఓం శాంతి శాంతి శాంతి ట్రైలర్‌‌‌‌‌‌‌‌

అలరిస్తోన్న ఓం శాంతి శాంతి శాంతి ట్రైలర్‌‌‌‌‌‌‌‌

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా ఏఆర్‌‌‌‌‌‌‌‌ సజీవ్ తెరకెక్కించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విజయ్ దేవరకొండ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు. పెళ్లి చూపుల సీన్‌‌‌‌తో మొదలైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌లో ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్‌‌‌‌, శాంతిగా ఈషా రెబ్బా కనిపించారు.

  ‘కలకత్తాలో చేపలని జలపుష్పాలు అంటారండీ.. . మీ పుష్పాలు నా చెవిలో యెట్టకండి’ అంటూ గోదావరి యాసలో తరుణ్‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌ చెప్పిన డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి.  చూడ్డానికి మంచోడిలా ఉన్నా డిఫరెంట్‌‌‌‌ మైండ్‌‌‌‌సెట్‌‌‌‌తో భార్యను ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపించాడు.   అలాంటి భర్తకు బుద్ధి చెప్పేందుకు ఆ భార్యామణి ఏం చేసిందనేది మూవీ మెయిన్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌.  ‘‘గోదారోళ్లకు వెటకారాలు సూట్ అయినట్టు ప్రతీకారాలు సూటవ్వవురా.. హీరోకు తక్కువ,  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌కు ఎక్కువలా తయారయ్యాడు’’ అంటూ కీలకపాత్రలో కనిపించిన బ్రహ్మాజీ తనదైన స్టైల్‌‌‌‌లో చెప్పిన డైలాగ్స్‌‌‌‌ హిలేరియస్‌‌‌‌గా పేలాయి. జై క్రిష్ సంగీతం, దీపక్ కెమెరా వర్క్‌‌‌‌ ఆకట్టుకున్నాయి. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 30న  విడుదల కానుంది.