
టాలీవుడ్ వర్గాల్లో తమన్నా(Tamannaah) ప్రేమాయణం ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమె మరోసారి తన ప్రియుడిపై ప్రశంసలు కురిపించింది. అతడితో ప్రేమలో పడినందుకు గల కారణాలను తెలిపింది. ‘విజయ్ వర్మ(Vijay Varma) కి ఆడవాళ్లను గౌరవించడం తెలుసు. వారి ఇంట్లోని స్త్రీలతోనే కాదు ఇతరులతోనూ ఎంతో మర్యాదగా ఉంటాడు. చాలా మంది మహిళల ప్రభావం అతడి జీవితంపై కచ్చితంగా ఉందని నేను భావిస్తాను.
యంగ్ జనరేషన్‌లోనూ ఈ తరహా మార్పు రావాలి. అన్నింటిలోనూ మహిళలే రాజీపడాలనే కాన్సెప్ట్‌ను నేను అంగీకరించను.
'విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. అదే నన్ను అతడితో ప్రేమలో పడేలా చేసింది’అంటూ తమన్నా తెలిపింది. ఇక హీరోలు శృంగార సీన్లు చేస్తే సూపర్ స్టార్స్‌ని చేస్తారని.. హీరోయిన్లను మాత్రం విమర్శిస్తారని తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది.