
హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలలో పెంచిన ఫీజులను తగ్గించుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఉన్నత విధ్యామండలిని ముట్టడించారు. పెంచిన ఫీజులు ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నత విధ్యామండలి కార్యాలయంలోకి దూసుకెళ్ళేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి గోషామహాల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా అని విద్యార్థులు ప్రశ్నించారు. అరెస్ట్ చేయడం అక్రమం, అన్యాయమని ..వెంటనే సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో కాసేపు ఉన్నత విధ్యామండలి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.