హక్కులు కాపాడేందుకే పెండ్లి వయసు పెంచాం

హక్కులు  కాపాడేందుకే పెండ్లి వయసు పెంచాం

న్యూఢిల్లీ: అమ్మాయిల పెండ్లి వయసు పెంపును విమర్శిస్తున్న వారిపై కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా స్పందించారు. 21 ఏండ్లు వ‌‌చ్చే వ‌‌ర‌‌కు పెండ్లి చేయ‌‌కుండా ఆపితే ఆడ‌‌పిల్లలు దారితప్పుతారని కొంద‌‌రు చేస్తున్న వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయా న్ని వ్యతిరేకిస్తున్న వారిది తాలిబాన్ మెంటాలిటీ అని కామెంట్​ చేశారు. ఢిల్లీ లో శనివారం జరిగిన మైనార్టీ దినోత్స వానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. మహిళల హక్కులను కాపాడేందుకే పెండ్లి వయసు పెంచామ ని.. వివాహ వయసు పెంచితే రోగ్​లు ఎందుకవుతారని ప్రశ్నించారు. రాజ్యాం గ సూత్రాల ప్రకారమే దేశం నడుస్తుంద ని.. మహిళలకు విద్యా, సామాజిక సాధికారత అవసరమని గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశా రు. ఇస్లామిక్ దేశాలు కూడా వివాహ నిబంధనలలో మార్పులు తెస్తున్నయని నఖ్వీ గుర్తుచేశారు.