తెలంగాణ ను నంబర్ వన్ చేయడమే లక్ష్యం

తెలంగాణ ను నంబర్ వన్ చేయడమే లక్ష్యం
  • రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర ఆర్ధికశాఖా మంత్రి హరీష్ రావు చెప్పారు. కంది మండలం చిదురుప్ప గ్రామంలో రైతు వేదికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ వచ్చాక మంచి‌నీటి బాధ లేకుండా ‌చేసిందన్నారు. తెలుగుదేశం హయాంలో కరెంటు బిల్లులు ముక్కు పిండి వసూలు చేసి కరెంటు మాత్రం ఇవ్వకుండా వేధించారని.. అలాగే కాంగ్రెస్ పార్టీ  కూడా ఉచిత విద్యుత్ అని చెప్పి ఉత్త విద్యుత్ ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎంగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అర్థరాత్రి దొంగ కరెంటు ఇచ్చారని, ఆనాడు  రైతు చనిపోతే రూపాయి ఇవ్వలేదన్నారు. తమ హయాంలో  రైతు చనిపోతే ఐదు లక్షల బీమా మొత్తం‌ రైతు ఇంటికి పంపుతున్నామని, రైతు బంధుకు కింద రూ. 700 కోట్లు ఒక్క సంగారెడ్డికి ఇచ్చామన్నారు. కొద్ది మంది తెరాస‌ ఏం చేసిందని అడుగుతున్నారు, ఉచిత కరెంటు, రైతుకు పెట్టుబడి సాయం పది వేలు,  రైతు బీమా, కళ్యాణ లక్ష్మి… ఇలా ఎన్నో చేస్తున్నామన్నారు. రైతుకు వ్యవసాయ పనిముట్లు రాయితీపై ఇవ్వాలని సీఎం యోచన చేస్తున్నారని,  రైతు బాగు కోసం సీఎం నిత్యం ఆలోచిస్తుంటారని హరీస్ రావు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక రెండు కోట్ల ఎకరాలు ఏడాది సాగు అవుతోందన్నారు. రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, ఇరవై లక్షల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కూరగాయలు సాగు, పండ్లతోటల సాగు లాభదాయకంగా ఉందన్నారు. తెలంగాణ ‌వచ్చాక‌ సంగారెడ్డిలో రూ. 200 కోట్ల రోడ్ల పనులు‌ వచ్చాయన్నారు.

For More News..

ఫేక్ వీడియో: కేసీఆర్ మీటింగ్‌కు వస్తే రూ. 500 ఇస్తామంటూ డప్పు చాటింపు

పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే ఏం చేయాలంటే..

మా అడవిని అమ్మనీయం

పర్యావరణ విధ్వంసంతోనే ప్రకృతి విపత్తులు

పుస్తకాల్లో భాష మారాలె