లెప్ట్ పార్టీలను పట్టించుకోని కేసీఆర్.. పొత్తు లేనట్టే.!

లెప్ట్ పార్టీలను పట్టించుకోని కేసీఆర్..  పొత్తు లేనట్టే.!

కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయడంతో   బీఆర్ఎస్, వామపక్షాలు పొత్తుకు తెరపడినట్లు అయ్యింది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరిగింది.  వామపక్షాలు కూడా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించాయి. తాము అడిగిన సీట్లు ఇస్తే కేసీఆర్ తో చేతులు కలిపేందుకు రెడీ అని చెప్పారు.

 కేసీఆర్ పిలిస్తే పొత్తులపై చర్చించేందుకు వెళ్తామని.. కొన్ని రోజుల నుంచి  ఎదరు చూశాయి లెఫ్ట్ పార్టీలు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్  ఆ తర్వాత వారిని పట్టించుకోవడం మానేశారు.  ఏకంగా  ఇవాళ 115 మంది అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేయడంతో వామపక్షాల పొత్తు లేనట్లేనని స్పష్టమవుతోంది.  సీపీఐ, సీపీఎం అడిగిన స్థానాల్లో కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై వామపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.


సీపీఐ అడిగిన సీట్లు

1.కొత్తగూడెం
2. వైరా
3.బెల్లంపల్లి
4.మునుగోడు

సీపీఎం అడిగిన సీట్లు

1.ఖమ్మం
2.పాలేరు
3.భద్రాచలం
4.మిర్యాలగూడ