పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag AShwin) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సౌత్, నార్త్ కు సంబందించిన స్టార్స్ నటించారు. వారిలో.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. దీపికా పదుకొనే, దిశా పటాని కీ రోల్స్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంలో వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న అన్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. కల్కి సినిమా యానిమేటెడ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ వర్షన్ ను సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియన్స్ ను అలరించనుందట. అది కూడా ఓటీటీలో. కానీ, ఏ ఓటీటీలో కల్కి యానిమేటెడ్ వర్షన్ రిలీజ్ కానుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ విషయంపై అధికారక ప్రకటన చేయనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా మహాభారతంతో మొదలై.. 2898 వ సంవత్సరం వరకు జరుగనుందని టాక్. ఇదే విషయాని దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఈ మధ్యనే కల్కి సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే రేంజ్ లో సినిమా కూడా ఉంటుందని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి.