
అహ్మదాబాద్: కరోనా ఆంక్షల వల్ల రెండేళ్లుగా ఐపీఎల్ ప్రారంభ, ముగింపు వేడుకలకు దూరంగా ఉన్న బీసీసీఐ ఈసారి ఫ్యాన్స్‌కు డబుల్ మజా అందించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు అట్టహాసంగా ముగింపు వేడుకల్ని నిర్వహించింది. ఈ మ్యాచ్‌కు హాజరైన లక్ష పైచిలుకు ప్రేక్షకుల నడుమ సెలబ్రిటీల పెర్ఫామెన్స్‌లు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఎనర్జిటిక్ డ్యాన్స్, మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమన్ బృందం మెస్మరైజింగ్ పాటలతో స్టేడియం మారుమోగిపోయింది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటునాటు, ‘మాస్టర్’ చిత్రంలోని వాతి కమింగ్, ‘కేజీఎఫ్ 2’లోని సాంగ్స్‌కు రణ్‌వీర్ డ్యాన్స్, రెహమాన్ గాత్రంతో సాగిన వందేమాతరం, జయహో సాంగ్స్ అటు స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల ముందు కూర్చున్న వీక్షకుల్ని కట్టిపడేశాయి.