బైక్ నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు

బైక్ నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పార్సెల్ కార్యాలయం ఎదురుగా పల్సర్ ద్విచక్రవాహనంలో నుండి ఒక్కసారిగా మంట‌లు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే బైక్ పూర్తిగా తగలబడింది. అక్కడే ఉన్న బైక్ యజమాని, పోలీసులు మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ వాహనాన్ని వేరే ప్రాంతానికి పంపించడం కోసం రైల్వే పార్సెల్ సర్వీస్ లో బుక్ చేయడానికి తీసుకొచ్చారు. పార్సల్ అధికారుల సూచనల మేరకు బైక్ లో ఉన్న పెట్రోల్ కాళీ చేస్తుండగా.. అనుకోకుండా స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయని తెలిపారు బైక్ య‌జ‌మాని, పోలీసులు.

ఆ మంటలు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. మంటలు పార్సల్ కార్యాలయానికి, రైల్వే స్టేషన్ కు తగిలితే ఊహకందని నష్టం జరిగేద‌న్నారు. లాక్ డౌన్, కరోన కారణంగా బస్సులు, రైళ్లు తిరుగుతుండడం లేదు కాబట్టి, ప్ర‌మాదం జ‌రిగిన‌చోట‌ జనాలు ఎక్కువగా లేక‌పోవడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌న్నారు పోలీసులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం