బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో పిటిషన్...ఇయ్యాల విచారణ

బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో  పిటిషన్...ఇయ్యాల విచారణ
  • సంజయ్ అరెస్టు అక్రమం
  • హైకోర్టులో బీజేపీ పిటిషన్
  • ఇయ్యాల విచారణ

హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. బుధవారం హైకోర్టుకు సెలవు కావడంతో తమ పిటిషన్‌ను జడ్జి ఇంటి వద్దనే విచారణ చేయాలని కోరుతూ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. సంజయ్‌ను తక్షణమే కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో కోరింది.

బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. అయితే సంజయ్‌ ను అరెస్టు చూపించి, రిమాండ్‌కు పంపుతున్నట్లు అడ్వకేట్‌ జనరల్‌ కార్యాలయం సమాచారం ఇవ్వడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్ విచారణకు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నిరాకరించారు. దీనిపై సంబంధిత న్యాయమూర్తి గురువారం మొదటి కేసుగా విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.