కిరాయి కట్టలేదని తహసీల్దార్ ఆఫీస్ కు తాళం

కిరాయి కట్టలేదని తహసీల్దార్ ఆఫీస్ కు తాళం

నారాయణ్ ఖేడ్, వెలుగు: కిరాయి కట్టలేదని సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ తహసీల్దార్ ​ఆఫీస్​కు బిల్డింగ్​ఓనర్​సోమవారం తాళం వేసింది. మండలాల విభజనలో భాగంగా మూడేండ్ల క్రితం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ ను ఆఫీసర్లు మండలంగా ప్రకటించారు. గవర్నమెంట్ బిల్డింగ్​ లేకపోవడంతో అప్పటి నుంచి సిర్గాపూర్ తహసీల్దార్​ఆఫీస్ అద్దె భవనంలోనే కొనసాగుతోంది. నెలకు రూ.6 వేలు చొప్పున కిరాయి కట్టాల్సి ఉండగా ఆఫీసర్లు మూడు ఏండ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే లక్ష రూపాయలు చెల్లించారు. ఎన్నిసార్లు అడిగినా ఆఫీసర్లు  స్పందించకపోవడంతో ఓనర్​నర్సమ్మ సోమవారం ఉదయం తహసీల్దార్​ఆఫీస్​కు తాళం వేసింది. దాదాపు రెండు గంటలపాటు ఆఫీసర్లు, సిబ్బంది, వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు రోడ్డు మీదే నిలబడ్డారు. తహసీల్దార్ రత్నం వచ్చి కిరాయి బకాయి గురించి కలెక్టర్, ఆర్డీఓతో మాట్లాడామని 15 రోజుల్లో క్లియర్​చేస్తామని చెప్పడంతో నర్సమ్మ తాళం తీసింది.