పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి

పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవేపై పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి

రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్  పీవీఎన్ఆర్  ఎక్స్‌ప్రెస్ వే కారు  ప్రమాదంజరిగింది. అతి వేగంగా  దూసుకొచ్చిన థార్ కారు  పిల్లర్ నెంబర్ 296 దగ్గర ఢీ వైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది . ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడిక్కడే  మృతి చెందాడు. ఈ ఘటనలో  కారు నుజ్జు నుజ్జు అయ్యింది. 


దీంతో హైవేపై   భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ను మరలించిన సిబ్బంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  అయితే ప్రమాద సమయంలో కారు 150 స్పీడ్ తో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.