సింగరేణి డైరెక్టర్గా వెంకన్న జాదవ్

సింగరేణి డైరెక్టర్గా వెంకన్న జాదవ్
  • ఐఆర్​టీఎస్ అధికారికి 3 ఏండ్ల డిప్యూటేషన్‌‌కు కేంద్రం ఆమోదం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే (ఐఆర్​టీఎస్)​ అధికారి బి. వెంకన్న జాదవ్​ను సింగరేణి లో డైరెక్టర్​గా కేంద్రం నియమించింది. మూడేండ్ల కాలపరిమితితో డిప్యూటేషన్‌‌ పద్ధతిలో సింగరేణిలో వెంకన్న విధులు నిర్వర్తించనన్నారు. ఈ మేరకు బుధవారం కేబినెట్ అపాయింట్ మెంట్స్ డిప్యూటీ సెక్రటరీ ఆన్నిస్ కన్నమాని జాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.

 ప్రస్తుతం సింగరేణి సీఎండీగా ఐఆర్ టీఎస్ ఆఫీసర్ బలరాంనాయక్ కొనసాగుతుండగా, ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఐఏఎస్ అధికారి గౌతమ్ పోట్రును డైరెక్టర్ గా నియమించింది. ఇప్పుడు సీఎండీతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.