300 సర్కారీ కంపెనీలు 30 అయితయ్​!

300 సర్కారీ  కంపెనీలు 30 అయితయ్​!
  • వాటాల అమ్మకంపై కేంద్రం దృష్టి
  • సేల్‌‌‌‌కు  స్పేస్‌‌‌‌, ఎనర్జీ, టెలికాం సెక్టార్లలోని పీఎస్‌‌‌‌యూలు
  • ఏ ఏ కంపెనీలలో వాటాలు అమ్మాలనే దానిపై నీతిఆయోగ్ కసరత్తు 

న్యూఢిల్లీ :

ప్రభుత్వ రంగ కంపెనీల నెంబర్​ను ఇప్పుడున్న 300 నుంచి 30 లోపుకి కుదించాలని కేంద్రం ఆలోచిస్తోంది. నాన్​–కోర్​ సెక్టార్​లోని కంపెనీలలో డిజిన్వెస్ట్​మెంట్​ వేగవంతం చేయాలని, నష్టాలతో నడుస్తున్న వాటిని మూసేయాలని ఇటీవలే  కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఏ ఏ కంపెనీలను మూసేయాలి, ఏ ఏ కంపెనీలలో డిజిన్వెస్ట్​ చేయాలనేది నీతీ ఆయోగ్​ స్టడీ చేస్తోంది. నీతీ ఆయోగ్​ రికమెండేషన్​ మేరకు  ఈ విషయంలో కేబినెట్​ త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. నాలుగు  కోర్​ సెక్టార్లను బడ్జెట్​లో గుర్తించారు. ఆ సెక్టార్లలో ఒక్కో దానిలో మూడు నుంచి నాలుగు పీఎస్​యూలను మాత్రమే అట్టేపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన అన్ని సెక్టార్లలోని పీఎస్​యూల నుంచి బయటకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది.

స్ట్రేటజిక్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ల నుంచి బయటకు..

బ్యాంకులు, ఇన్సూరెన్స్​ రంగంలోని  కంపెనీలలో పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తోంది. అటామిక్​ ఎనర్జీ, స్పేస్​, డిఫెన్స్​, ట్రాన్స్​పోర్ట్​, టెలికమ్యూనికేషన్స్​, పవర్​, పెట్రోలియమ్, కోల్​, ఇతర మినరల్స్​, బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​, ఫైనాన్షియల్​ సర్వీసెస్​ సెక్టార్లను స్ట్రేటజిక్​ సెక్టార్లుగా గుర్తిస్తున్నట్లు బడ్జెట్​లో ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. స్ట్రేటజిక్​ సెక్టార్లలో ప్రభుత్వ రంగ కంపెనీలు నామమాత్రంగా మాత్రమే ఉండాలని పాలసీ డెసిషన్​ను గవర్నమెంట్​ తీసుకుంది. దీంతో స్ట్రేటజిక్ సెక్టార్లలోని పీఎస్​యూలను ప్రైవేటుకి అప్పచెప్పడంతోపాటు, కొన్నింటిని మెర్జ్​ చేయడం, మరికొన్నింటిని వేరే పెద్ద  కంపెనీలకు సబ్సిడరీలుగా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం ప్రపోజ్​ చేస్తోంది. కొన్నింటిని మూసేయాలనే ప్రతిపాదనా ఉంది.

సంస్కరణలను మరింత చురుగ్గా అమలు చేసే దిశలోనే ప్రభుత్వం అడుగులు వేయాలనుకుంటోందనే విషయం తాజా బడ్జెట్​ ప్రకటనతో స్పష్టమవుతోంది. పీఎస్​యూల ప్రైవేటీకరణ మరింత చురుగ్గా సాగించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందనేదీ అర్ధమవుతోంది. వివిధ కంపెనీల పనితీరు మెరుగుపడేందుకు, సామర్ధ్యం మెరుగుపడేందుకూ ప్రైవేటుకి లేదా​ విదేశీ ఇన్వెస్టర్లకు అప్పచెప్పడమే కరెక్టని ప్రభుత్వం భావిస్తోంది.  ​ మరోవైపు డిజిన్వెస్ట్​మెంట్​ ద్వారా తనకి అవసరమైన నిధులు సేకరించుకునే వీలూ ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన. కరోనా మహమ్మారితో పడిపోయిన ఎకానమీని పుంజుకునేలా చేయాలంటే  ప్రభుత్వానికి నిధులు చాలా అవసరం.

యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా 249 పీఎస్‌‌‌‌‌‌‌‌యూలు..

పబ్లిక్​ ఎంటర్​ప్రైజస్​ సర్వే 2018–19  ప్రకారం దేశంలో 348 కంపెనీలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఇందులో 249 పీఎస్​యూలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 86 నిర్మాణ దశలో ఉండగా, ఇంకో 19 పీఎస్​యూలు క్లోజర్​, లిక్విడేషన్​ దిశలో ఉన్నాయి. కొత్త పాలసీతో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని, ప్రభుత్వ సీనియర్​ ఆఫీసర్స్​ చెబుతున్నారు. ఇంజినీర్స్​ ఇండియా వంటి కన్సల్టింగ్​ కంపెనీలు డజను దాకా ఉంటాయని, అలాంటి వాటిని కొనడానికి ముందుకు వచ్చేవాళ్లు తక్కువగా ఉంటారని, ఎందుకంటే వివిధ పీఎస్​యూల నుంచి అవసరమైన ఉద్యోగులను తీసుకుని ఈజీగానే కొత్త కన్సల్టింగ్​ కంపెనీలు పెట్టుకోవచ్చని అన్నారు. ఎక్కువ షేర్​ అమ్మాలనుకుంటే మాత్రం ప్రభుత్వం జాగ్రత్తగానే పరిశీలించాల్సి ఉంటుంది. ఆయిల్​ వంటి రంగాలలోని కంపెనీలలో భారీగా వాటాలను అమ్ముదామనుకుంటే, కొనే ప్రైవేటు కంపెనీలూ తక్కువగానే ఉంటాయనేది సీనియర్​ ఆఫీసర్ల వాదన. ఇందుకోసం తగిన స్ట్రేటజీలను రూపొందించుకోవల్సి ఉంటుందని, ఏ సెక్టార్​కి ఆ సెక్టార్​ను ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుందని ఒక సీనియర్​ ఆఫీసర్​  పేర్కొంటున్నారు

భెల్​, మెకాన్​, ఆండ్రూ యూల్​లో వాటా అమ్మకం ఈ ఏడాదే……

భారత్​ హెవీ ఎలక్ట్రికల్స్​ లిమిటెడ్​ (భెల్​), మెకాన్​ లిమిటెడ్​, ఆండ్రూ యూల్​ అండ్​ కంపెనీ లిమిటెడ్​లలో వాటాను ఈ ఏడాది అమ్మాలని ప్రభుత్వం చూస్తోంది. భెల్​లో వాటా అమ్మాలని అడ్వైజర్​గా ఉన్న ఎస్​బీఐ క్యాపిటల్​ మార్కెట్స్​ ప్రపోజ్​ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ పబ్లిక్​ ఎసెట్ మేనేజ్​మెంట్​ (దీపమ్​)కు ఒక రిపోర్టును ఎస్​బీఐ క్యాపిటల్​ మార్కెట్స్​ అందచేసింది. దేశంలోని అతి పెద్ద పవర్​ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్​ అయిన భెల్​లో ఎంత వాటా అమ్మాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి గవర్నమెంట్​కు ఈ రిపోర్డు సాయపడుతుంది. మెకాన్​ లిమిటెడ్​, ఆండ్రూ యూల్​ కంపెనీలలో వాటాల అమ్మకానికి కూడా ఎస్​బీఐ క్యాపిటల్​ మార్కెట్సే అడ్వైజర్​గా వ్యవహరిస్తోంది. డిజిన్వెస్ట్​మెంట్​ ద్వారా మొత్తం రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని గవర్నమెంట్​ ఈ ఏడాదికి టార్గెట్​గా పెట్టుకుంది. ఎయిర్​ ఇండియా, బీపీసీఎల్​లలో వాటాల అమ్మకం రాబోయే ఫైనాన్షియల్​ ఇయర్​కు పోస్ట్​పోన్​ కావడంతో, 2019–20లో డిజిన్వెస్ట్​మెంట్​ టార్గెట్స్​ను గవర్నమెంట్​ అందుకోలేకపోయింది. భెల్​లో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్స్​, బ్యాంకులు, ఇన్సూరెన్స్​ కంపెనీలు, ఫారిన్​ ఇన్వెస్టర్ల చేతిలోనూ కొన్ని వాటాలున్నాయి. థర్మల్, గ్యాస్​, హైడ్రో, న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్స్​ కోసం ఎక్విప్​మెంట్​ను తయారు చేయడంలో భెల్​ పేరొందింది. భెల్​కు మొత్తం 16 మాన్యుఫాక్చరింగ్​ యూనిట్లున్నాయి. టీ, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్​, ల్యూబ్రికెంట్స్​, ప్రింటింగ్​ రంగాలలో ఆండ్రూ యూల్​ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెటల్స్​, మైనింగ్​ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెకాన్​, ఇటీవల ఎనర్జీ, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, స్పేస్​, డిఫెన్స్​లలో డైవర్సిఫికేషన్​ ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టింది.