తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు ప్లాస్టిక్ సామాను వాడొద్దు

తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు ప్లాస్టిక్ సామాను వాడొద్దు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన శానసభ  ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్ లో పోటీ చేస్తోన్న అభ్యర్థులు శుక్రవారం 3వ తేదీ నుంచి నామినేషన్లు వేయడం ప్రారంభించారు. అయితే ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల నాయకులందరు వారి నేర చరిత్ర ఏమైనా ఉంటే అందుకు సంబంధించిన వివరాలను పూర్తిగా అఫిడవిట్ లో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. అలాగే మూడు దఫాలుగా అన్ని వార్త పత్రికల్లో యథాతథంగా  ప్రజలందరికీ తెలిసే విధంగా వాటిని  ప్రచురించాలని పేర్కొంది. దీనివల్ల ఓటు వేసే వారందరికీ  ఎన్నికల్లో పోటీ చేస్తోన్న  అభ్యర్థుల మీద ఉన్నటువంటి కేసుల వివరాలన్ని తెలుస్తాయి.

ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకులందరు ప్లాస్టిక్ తో తయారు చేసిన జెండాలను, పార్టీ కండువాలను వాడకూడదని సీఈసీ  తెలిపింది. విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యం నిత్యం పెరుగుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో నాయకులందరు తమ పార్టీలోకి  వచ్చే వారందరినీ కండువాలు కప్పి ఆహ్వానిస్తుంటారు.

ఇందుకోసం ప్లాస్టిక్ తో తయారైన సామాగ్రిని ఉపయోగించడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఈ వ్యర్థాలు పేరుకుపోతాయి. అప్పుడు వాతావరణంతో పాటు మనందరి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కావునా కేంద్ర ఎన్నికల సంఘం వారు రూపొందించిన ఎన్నికల నియామవళిని తప్పనిసరిగా అభ్యర్థులందరూ  పాటించి అందరికీ సహకరించాలి. వీటిని ఉల్లంఘించిన వారిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

- కూరపాటి శ్రావణ్,
-కొండాపూర్, జనగామ జిల్లా