కరీంనగర్​కు సైనిక్ స్కూల్ 

కరీంనగర్​కు సైనిక్ స్కూల్ 

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్​లో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్జీవోలు, ప్రైవేట్​ స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ స్కూల్​ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శనివారం రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 21 సైనిక్ స్కూళ్లను స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు స్కూల్స్, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2022-23 సంవత్సరానికి గాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది మే ఫస్ట్ వీక్ నుంచే కొత్తగా ఏర్పాటు కానున్న సైనిక్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. 6వ తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది. ఇందులో 40 శాతం మంది విద్యార్థులకు అఖిల భారత సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్​ఎగ్జామ్  ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటి వరకు అదే స్కూల్​లో చదువుతున్న విద్యార్థులకు అర్హత పరీక్ష పెట్టి మిగతా 60 శాతం సీట్లను భర్తీ చేస్తారు. ఏపీలోని కడపలో జిల్లాలో మరో సైనిక్ స్కూల్​ను ఏర్పాటు చేయనున్నారు.