పిల్లల ముక్కు : కరోనా ప్రభావం తక్కువే

పిల్లల ముక్కు : కరోనా ప్రభావం తక్కువే

కరోనా మొదలైనప్పడు పిల్లలకు ఇన్ఫెక్షన్ వస్తే ఎలా? వాళ్లు తట్టుకోగలరా? అనే ప్రశ్నలు చాలామంది తల్లిదండ్రులకు వచ్చాయి. అయితే... అందరూ భయపడినట్టుగా పిల్లల మీద కరోనా వైరస్ అంతగా ప్రభావం చూపలేదు. అందుకు కారణం..వాళ్ల ముక్కు గట్టిది అంటున్నారు అమెరికాలోని క్వీన్స్​లాండ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు. 

ఈ స్టడీ ప్లస్​ బయాలజీ అనే జర్నల్​లో వచ్చింది. 

పిల్లల్లో కరోనా ఇన్ఫెక్షన్ తక్కువ ఉండడానికి కారణం తెలుసుకునేందుకు ఆరోగ్యంగా ఉన్న 23 మంది పిల్లలు, కరోనా వచ్చిన 15 మంది పెద్దవాళ్ల ముక్కులోని కణాలని శాంపిల్​గా తీసుకుని టెస్ట్ చేశారు. పిల్లల ముక్కులోని కణాల్లో యాంటీ వైరల్ రెస్పాన్స్ ఉండడం వల్ల  వైరస్ కణాలు వేగంగా పెరగకపోవడం గమనించారు. దానివల్లే  పిల్లల్లో కరోనా ఇన్ఫెక్షన్ తక్కువ. ఒకవేళ ఇన్​ఫెక్షన్ వచ్చినా లక్షణాల తీవ్రత కూడా కొంచెమే అంటున్నారు ఈ రీసెర్చ్​లో పాల్గొన్న కిర్​స్టీ షార్ట్ అనే రీసెర్చర్. అయితే ఒక ఒమిక్రాన్ వేరియెంట్ విషయంలో అలా జరగలేదని గుర్తించారు.