
సంక్రాంతికి ‘సర్కారువారి పాట’తో రావాల్సిన మహేష్ బాబు కొన్ని కారణాల వల్ల ఉగాదికి షిఫ్టయ్యాడు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా విడుదలకి రూట్ క్లియరయ్యేలా కనిపించడం లేదు. మహేష్ మోకాలికి సర్జరీ కావడం, తర్వాత తను కొవిడ్ బారిన పడటంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. మరోవైపు అదే రోజున ‘ఆచార్య’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. దాంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడే చాన్స్ ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్, రాజమౌళిల డైరెక్షన్‌లో నటించనున్నాడు మహేష్. వీటిలో త్రివిక్రమ్ సినిమా ముందుగా పట్టాలెక్కనుంది. ఏప్రిల్‌లో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఆల్రెడీ తమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు ఇటీవల రివీల్ చేశాడు. మహేష్‌కి ఇది ఇరవై ఎనిమిదో సినిమా. పూజా హెగ్డే హీరోయిన్. త్రివిక్రమ్ మాటల తూటాలకు, మహేష్ మేనరిజం తోడయితే ఎలా ఉంటుందనేది ఇప్పటికే రెండుసార్లు ప్రూవ్ అయ్యింది. మరోసారి వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేయనుండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.