ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి విచారణ చేయాలి : డీజీపీకి కాంగ్రెస్ లీడర్స్ కంప్లయింట్

ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి విచారణ చేయాలి : డీజీపీకి కాంగ్రెస్ లీడర్స్ కంప్లయింట్

హైదరాబాద్: కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న వార్ రూంలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గురువారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు తుమ్మేటి సమ్మి రెడ్డి, పలువురు కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. 2021లో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల సమయం నుండి ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని వారు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఇలాంటివి చేయించాడని ఫిర్యాదు చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో ఈ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న వార్ రూమ్ లో ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని పోలీసులు వార్ రూమ్ పై దాడి చేసి , ఆధారాలను సేకరించాలని బండి సుధాకర్ గౌడ్ డీజీపీని కోరారు. అధికారంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసి సెలెబ్రెటీలను, వ్యాపారవేత్తలను బెదిలించి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని ఆయన తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ చేసి , సెలెబ్రెటీలను , వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు.