వచ్చే నెల 4న కాంగ్రెస్ ‘చలో ఢిల్లీ’

వచ్చే నెల 4న కాంగ్రెస్ ‘చలో ఢిల్లీ’

22 సిటీల్లో సోమవారం పార్టీ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ లు

న్యూఢిల్లీ: దేశంలో ధరలు, నిరుద్యోగం, విద్వేషాల పెరుగుదలకు వ్యతిరేకంగా వచ్చే నెల 4న ‘ఢిల్లీ చలో’ కార్యక్రమానికి భారీగా తరలి రావాలంటూ కాంగ్రెస్ పార్టీ తన క్యాడర్ కు పిలుపునిచ్చింది. సోమవారం వివిధ రాష్ట్రాల్లోని 22 ప్రధాన నగరాల్లో ఆ పార్టీ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ చలో కార్యక్రమంలో భాగంగా రాంలీలా మైదాన్ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ర్యాలీలో పార్టీ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. కాగా, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలేనని రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం ఆయన ఫేస్ బుక్ లో ఈ మేరకు హిందీలో ఓ పోస్ట్ చేశారు.