ఏపీ టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్

ఏపీ టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (ఏపీ టెట్-2024) నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీక్షలో 20 శాతం వెయిటేజీ ఉంది. అభ్యర్థులు 1 నుంచి -5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6 -నుంచి 8 తరగతుల బోధనకు పేపర్-2(ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

అర్హతలు : పేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టి ఇంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్మీడియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాచిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్సమానం. 2023–-24 విద్యా సంవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్సరం చివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి ఏడాది చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దివే అభ్యర్థులూ అర్హులే.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేస్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.750 చెల్లించాలి. పరీక్ష ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహిస్తారు. మార్చి 14న ఫలితాలు విడుదల చేస్తారు. వివరాలకు www.aptet.apcfss.in వెబ్​సైట్​లో చూడాలి.