వైద్యం పేరుతో బొడ్డు చుట్టూ కొరికిన నాటు వైద్యుడు

V6 Velugu Posted on Sep 15, 2021

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నాటు వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ పసి బాలుడు మరణించాడు. వివరాలలోకి వెళితే.. కరకగూడెం మండలం అశ్వపురపాడు అనే గొత్తికోయ గ్రామానికి చెందిన ఓ బాలుడికి కడుపునొప్పి వచ్చింది. దాంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉండే నాటు వైద్యుడిని సంప్రదించారు. కడుపునొప్పి తగ్గిస్తానని చెప్పి నాటు వైద్యుడు బాలుడి బొడ్డు చుట్టూ కొరికాడు. దాంతో బాలుడి చిన్న పేగు తెగింది. బాలుడికి తీవ్రస్రావం అవుతుండటంతో తల్లిదండ్రులు వెంటనే భద్రాచలం ఏరియా హాస్పిటల్‎కు తరలించారు. బాలుడి పరిస్థితి చూసి అసలు ఏం జరిగిందంటూ తల్లిదండ్రులను వైద్యులు నిలదీశారు. దాంతో జరిగిన విషయం గురించి తల్లిదండ్రులు  వైద్యులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Tagged Telangana, Bhadradri Kothagudem, bhadrachalam area hospital, Healing, stomach pain

Latest Videos

Subscribe Now

More News