డిగ్రీలో చేరాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. మే 21తో ముగియనున్న దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

డిగ్రీలో చేరాలనుకునే వారికి బిగ్ అలర్ట్.. మే 21తో ముగియనున్న దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిదానంగా సాగుతోంది. సోమవారం వరకు 64 వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 53 వేల మంది పేమెంట్స్ చేయగా, 43 వేల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఈనెల3న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 21తో ముగియనున్నది. 

మరోవైపు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ఈనెల10న ప్రారంభం కాగా, ఇప్పటికీ 32 వేల మంది ఆప్షన్స్‌ ఇచ్చుకున్నారు. 22వ తేదీతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా ముగియనుండగా, 29న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ కానున్నది. చివరి రెండు మూడ్రోజుల్లో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.