విద్యాశాఖ కీలక ఆదేశాలు : గవర్నమెంట్ స్కూల్స్‌లో పేరెంట్స్ టీచర్ మీటింగ్

విద్యాశాఖ కీలక ఆదేశాలు : గవర్నమెంట్ స్కూల్స్‌లో పేరెంట్స్ టీచర్ మీటింగ్

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. జూలై 20న పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే థీమ్ తో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కచ్చితంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు రావాలని అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్లు తల్లిదండ్రులకు ఇన్విటేషన్ ఇవ్వాలని విద్యాశాఖ జారీ చేసిన సర్కులర్ లో పేర్కొన్నారు. మీటింగ్ లో పాల్గొన్న  వారి వివరాలు మండల, జిల్లాల అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసుకు పంపాలని సూచించారు.