స్కూల్​ ఉన్నా లేకున్నా అన్ని ఫీజులు కట్టాల్సిందే

స్కూల్​ ఉన్నా లేకున్నా అన్ని ఫీజులు కట్టాల్సిందే
  • మీ పిల్లలు స్కూల్​కి వెళ్లకున్నా ట్రాన్స్​పోర్టేషన్ ఫీజు కట్టాల్సిందే.
  • క్యాంటీన్​లో తినకున్నామెస్​కి పేమెంట్ కంపల్సరీ.
  • ఆన్​లైన్​లో క్లాసులు వింటున్నాలైబ్రరీ ఫీజు ఇవ్వాల్సిందే

ఇదీ సిటీలోని పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్​మేనేజ్​మెంట్ల తీరు. జీఓ46 ప్రకారం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. విద్యా శాఖకు పేరెంట్స్ కంప్లయింట్ ​చేస్తూ, స్కూల్స్ ఎదుట ఆందోళనకు దిగుతున్నా మారడం లేదు. ట్యూషన్ ఫీజు పేరుతో అన్ని రకాల ఫీజులూ వసూలు చేస్తున్నాయి. లాక్​డౌన్​ ఇబ్బందుల్లో ఉన్న పేరెంట్స్​ అధిక ఫీజుల భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు:రెగ్యులర్ స్కూల్​లో అయితే ట్రాన్స్​పోర్టేషన్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్ ల్యాబ్, స్పోర్ట్స్, ఆర్ట్స్, మెస్, లైబ్రరీ, ట్యూషన్ వంటివి ఫీజులో భాగంగా ఉంటాయి. లాక్ డౌన్​తో స్కూళ్లు రీ ఓపెన్​ కాకున్నా, ఆన్లైన్ క్లాస్​లు రన్​ చేస్తున్నా మేనేజ్​మెంట్లు అన్ని ఫీజులూ చార్జ్​ చేస్తున్నాయి. ఆన్లైన్ క్లాసుల పేరుతో పేరెంట్స్​పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది పేరెంట్స్ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆన్​లైన్ క్లాసుల వల్ల స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్​ కూడా రాట్లేదని, అయినా ఫీజులన్నీ కట్టాలని మేనేజ్​మెంట్స్​ఫోర్స్ చేస్తున్నాయని వాపోతున్నారు.

బుక్స్, ట్యాబ్స్ కొనాలంటూ..

ఇప్పటికే కొన్ని స్కూల్స్ ఫీజులు చెల్లించిన స్టూడెంట్స్​కే ఆన్లైన్ లో క్లాసులు వినేందుకు ఐడీ, పాస్​వర్డ్ ఇచ్చాయి. పేమెంట్​ చేస్తే బుక్స్ ఇం టికి పంపిస్తామంటున్నాయి. డిజిటల్ క్లాసులు వినేందుకు ట్యాబ్ లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ డివైజ్ స్కూల్ లోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నాయి.

ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి

మా పాప ఫోర్త్​ క్లాస్ చదువుతోంది. ఫీజు పే చేస్తేనే ఆన్​లైన్​ క్లాసులు వినేందుకు  ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చారు. రేపటి నుంచి క్వాటర్లీ ఎగ్జామ్స్ కండెక్ట్ చేస్తామని చెప్తున్నారు. మళ్లీ ఫీజు చెల్లించాలని స్కూల్స్ నుంచి ఫోన్​ చేస్తున్నారు. మాములుగా అయితే ఇయర్లీ ఫీజు 65వేలు. అందులో ట్యూషన్ ఫీజుతోపాటు పీఈటీ, స్కే టింగ్, మ్యూజిక్, స్విమ్మింగ్, ఆర్ట్, కంప్యూటర్ ల్యాబ్​వంటివన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ సారి అవన్నీ కలిపి కట్టాలంటున్నారు. ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి.

– రాజేశ్వరి, పేరెంట్

మొత్తం ఫీజులో30 శాతమే..

మా అమ్మాయి బోయిన్ పల్లిలోని సెయింట్ ఆండ్రోస్ స్కూల్ లో చదువుతోంది. మాములుగా అయితే కంప్యూటర్ ల్యాబ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ, స్పోర్ట్స్, మెస్, ట్యూషన్ ఫీజులన్నీ కలిపి పే చేస్తాం. అందులో ట్యూషన్ ఫీజు 30శాతం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు చెబుతున్నా, మేనేజ్​మెంట్ 100శాతం ఫీజు అడుగుతోంది. ట్యూషన్ ఫీజులోనే అన్నీ క్లబ్ చేసి కట్టమంటోంది. ఈ మధ్యే పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశాం. అయినా తీరు మారడం లేదు.

‑ విజయ్ కుమార్, పేరెంట్

తెలంగాణ జిల్లాలకు కరోనా రిస్క్ ఎక్కువ