మాతృదేవోభవ తరహాలో డైమండ్ డెకాయిట్‌‌

మాతృదేవోభవ తరహాలో డైమండ్ డెకాయిట్‌‌


పార్థ గోపాల్‌‌ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్‌‌’. మేఘన హీరోయిన్‌‌.  సూర్య జి యాదవ్ దర్శకుడు. ఏప్రిల్ 10న సినిమా విడుదల  కానుంది. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థ గోపాల్ మాట్లాడుతూ ‘ఇదొక  కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.  ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా  ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి’ అని అన్నాడు.   దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ ‘33 ఏళ్ల క్రితం వచ్చిన  ‘మాతృదేవోభవ’  సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందే. ఆ తరహా భావోద్వేగాన్ని మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే  ప్రయత్నమే ఈ చిత్రం’ అని చెప్పాడు.