హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైన కాకా మెమోరియల్ T20 లీగ్ ఫైనల్ మ్యాచ్..

హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైన కాకా మెమోరియల్  T20 లీగ్ ఫైనల్ మ్యాచ్..

విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ T20 లీగ్ ఫైనల్ మ్యాచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం (జనవరి 17) సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్సు లో జరుగుతున్న మ్యాచ్ కు మంత్రులు వివేక్ వెంకటస్వామి,  పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజారుద్దీన్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, BCCI మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్,  HCA సభ్యులు హాజరయ్యారు. 

ఫైనల్ లో ఖమ్మం, నిజామాబాద్ టీమ్ లు తలపడుతున్నాయి. ఖమ్మం జిల్లా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్ దశలో అత్యుత్తమ ఆటతీరుతో ఫైనల్ కు చేరుకున్న ఈ రెండు టీమ్ ల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇందులో విజయం సాధించిన టీమ్ కు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు. 

తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం టీమ్.. నిర్ణీత 19.5 ఓవర్లకు 114/10 రన్స్ చేసింది. నిజామాబాద్ ముందు 115 రన్స్ టార్గెట్ ను ఉంచింది.