‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ రిలీజ్

‘బెదురులంక 2012’ ఫస్ట్ లుక్ రిలీజ్

నేహాశెట్టి పేరు చెబితే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు కానీ  ‘డీజే టిల్లు’లో రాధిక అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు ప్రేక్షకులు. అంతకంటే ముందు మూడు సినిమాల్లో నటించినా ఎక్కువగా గుర్తింపును అందుకుంది మాత్రం రాధిక పాత్రతోనే. అందులో మోడ్రన్‌‌‌‌ గర్ల్‌‌‌‌గా కనిపించిన ఆమె... ఈసారి ట్రెడిషనల్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో సర్‌‌ప్రైజ్ చేసింది. కార్తికేయకు జంటగా ఆమె నటిస్తోన్న చిత్రం ‘బెదురులంక 2012’. సోమవారం నేహా పుట్టినరోజు సందర్భంగా తన  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘చిత్ర’ అంటూ తన పాత్రను కూడా పరిచయం చేశారు.

‘ట్రెడిషనల్‌‌‌‌గా కనిపించే మోడ్రన్ అమ్మాయి పాత్రను పోషిస్తోందని, పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ  లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది అంటూ క్యారెక్టర్ గురించి చెప్పారు దర్శకుడు క్లాక్స్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ కలర్‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటుందన్న నిర్మాత రవీంద్ర బెనర్జీ... షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని..  డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాకు హైలైట్స్‌‌‌‌గా నిలుస్తాయని చెప్పారు. 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్ల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.