జూన్-30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి

జూన్-30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి

హైద‌రాబాద్ : జూన్-30 వరకు మొదటి దశ చెక్ డ్యాంలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. సాగు నీటి అంశాలపై మంగళవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కేసీఆర్..నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలన్నారు.

అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలని తెలిపారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. లిప్టుల‌ ప్రకారం అంచనాలను వేర్వేరుగా తయారు చేసి , అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను కేసీఆర్ ఆదేశించారు.