డ్యూడ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది

డ్యూడ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది

ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ జంటగా  కీర్తిశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. యూత్‌‌‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌‌‌‌ అప్‌‌‌‌డేట్‌‌‌‌ను అందించారు మేకర్స్. ‘బూమ్ బూమ్’ అంటూ సాగే మొదటి పాటను ఆగస్టు 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

సాంగ్ అనౌన్స్‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూ  ట్రెండీ లుక్‌‌‌‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నారు.  దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో     విడుదల     కానుంది.