ఉస్మానియాలో కార్పొరేటుకు దీటుగా వైద్య సేవలు

ఉస్మానియాలో కార్పొరేటుకు దీటుగా వైద్య సేవలు
  •     కార్పొరేటుకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నం
  •     హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.నాగేందర్​

హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ఉస్మానియా ఆస్పత్రి​లో సర్జరీలు చేస్తున్నామని సూపరింటెండెంట్ డా.నాగేందర్​ చెప్పారు. ఓల్డ్ ​బిల్డింగ్ ​క్లోజ్​చేయడంతో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కొవిడ్ ​నేపథ్యంలో ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్, సర్జరీలు చేయట్లేదని వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. ఆయుష్మాన్​ భారత్ స్కీం కింద తొలి సర్జరీ చేసిన సందర్భంగా శుక్రవారం ఆయన హాస్పిటల్​లో మీడియాతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ అమలులోకి వచ్చాక ఫస్ట్​సర్జరీ విజయవంతంగా పూర్తి చేశామని, అది కూడా ఇతర రాష్ట్రానికి చెందిన పేషెంట్​కు అని తెలిపారు. మహారాష్ట్రలోని షోలాపూర్​కి చెందిన భాగ్యశ్రీ(33)కి  మెష్ రిపేర్ విత్ అనాలికోప్లాస్టీ సర్జరీ చేసినట్లు చెప్పారు. ఉస్మానియాలో సరపడా అనుభవజ్ఞులైన డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారన్నారు. పేషెంట్లు వైద్య సేవల్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ డిపార్ట్​మెంట్ డాక్టర్లను, అనస్థీషియా డిపార్ట్​మెంట్​ హెచ్​వోడీ డా.పాండునాయక్​ను ప్రత్యేకంగా అభినందించారు. అడిషనల్ సూపరింటెండెంట్ డా.త్రివేణి, ఆర్ఎంవో డాక్టర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.