గద్దర్ అవార్డ్తో బాధ్యత పెరిగింది అంటున్న దండోరా మ్యూజిక్ డైరెక్టర్

గద్దర్ అవార్డ్తో బాధ్యత పెరిగింది అంటున్న దండోరా మ్యూజిక్ డైరెక్టర్

మల్లేశం, జాంబీరెడ్డి, మిషన్ ఇంపాజిబుల్,  ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ లాంటి పలు చిత్రాలకు సంగీతం అందించిన మార్క్ కె రాబిన్.. రీసెంట్‌‌గా తను కంపోజ్ చేసిన ‘దండోరా’ చిత్రానికిగాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా గద్దర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు మరింత మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు  స్ఫూర్తిగా ఈ అవార్డ్ నిలుస్తుందని నమ్ముతున్నా. నాపై  బాధ్యత పెరిగిందని భావిస్తున్నా.  ఈ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు కృతజ్ఞతలు.

 ‘దండోరా’ సినిమాలోని  కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఇన్‌‌స్పైర్ చేసింది. భావోద్వేగం  నిండిన మనసుతోనే  ఈ  సినిమాకు సంగీతాన్ని అందించాను.  స్థానిక వాయిద్యాలతో మ్యూజిక్  కంపోజ్ చేశా.  నాకు బాల్యం నుంచే సంగీతం మీద ఇష్టం ఉండేది.  నేను టీచర్‌‌‌‌గా వర్క్ చేశా.  లిరిసిస్ట్  కృష్ణకాంత్ నాకు మంచి మిత్రుడు. నేను, తను, ప్రశాంత్ వర్మ రెగ్యులర్‌‌‌‌గా కలుస్తుండేవాళ్లం.  నాని హీరోగా నటించిన  ‘మజ్ను’ మూవీ ట్రైలర్‌‌‌‌కు బీజీఎం ఇచ్చా.  

ఆ ట్రైలర్‌‌‌‌కు నేను అందించిన సంగీతం నచ్చిన హీరో నాని.. తను నిర్మిస్తున్న అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా అవకాశం ఇచ్చారు.  ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.  అలా టాలీవుడ్‌‌లో సంగీత దర్శకుడిగా  ప్రయాణం మొదలైంది.  ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో  20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను.  

నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టం.   మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్.  గద్దర్ అవార్డ్స్‌‌లో ఆయనను కలిసి  షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ సందర్భం ఒక స్వీట్ మెమొరీగా గుర్తుండిపోతుంది.   ప్రస్తుతం ‘కథాకళి’ అనే ఒక సినిమా చేస్తున్నా. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నా. ఒక స్టార్ హీరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పాడు.