జిమ్నాస్టిక్స్‌‌‌‌లో ‘ది గాడియం’ పతకాల మోత

జిమ్నాస్టిక్స్‌‌‌‌లో  ‘ది గాడియం’  పతకాల మోత

హైదరాబాద్, వెలుగు: నేషనల్ లెవెల్ జిమ్నాస్టిక్స్ ఈవెంట్ జిమ్‌‌‌‌క్విన్ రెండో ఎడిషన్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లోని ఆతిథ్య ది గాడియం స్కూల్‌‌‌‌ పతకాల మోత మోగించింది. సోమవారం (జులై 08) ముగిసిన ఈ  రెండు రోజుల ఈవెంట్‌‌‌‌లో  గాడియం 113 గోల్డ్ మెడల్స్‌‌‌‌ నెగ్గింది.  

మరో 150 రజతాలు, 168 కాంస్యాలతో కలిపి మొత్తం 431 పతకాలతో టాప్ ప్లేస్‌‌‌‌ సొంతం చేసుకుంది. తమిళనాడు  సేలంకు చెందిన హై ఫ్లైయర్స్  231 పతకాలతో (102 స్వర్ణం, 101 రజతం, 28 కాంస్యం) రన్నరప్‌‌‌‌గా నిలవగా. చెన్నైకి చెందిన జిమ్నోరా 91 గోల్డ్ సహా 348 పతకాలు నెగ్గింది. 

ఈ ఈవెంట్‌‌‌‌లో 15 రాష్ట్రాలకు   850 మంది యువ జిమ్నాస్ట్‌‌‌‌లు  రిథమిక్ జిమ్నాస్టిక్స్‌‌‌‌, డ్యాన్స్ జిమ్నాస్టిక్స్‌‌‌‌, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ఫ్లోర్ రొటీన్స్‌‌‌‌ గ్రూప్ అక్రోబాటిక్స్‌‌‌‌లో పోటీ పడ్డారు. ఆతిథ్య గాడియం స్కూల్ ఫౌండర్, డైరెక్టర్ కె. కీర్తి రెడ్డి విన్నర్లకు మెడల్స్‌‌‌‌ అందజేశారు.