ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్ 5న విడుదల

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ ఏప్రిల్ 5న విడుదల

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌‌‌‌లో ఉంది రష్మిక మందన్న. ఆమె చేతిలో ప్రస్తుతం దాదాపు  అరడజనుకుపైగా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో తను ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న రష్మిక బర్త్‌‌‌‌డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తున్నట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది.

ఈ సందర్భంగా టీజర్ కోసం ఐదు భాషల్లోనూ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పినట్టు తెలియజేసింది. అయితే ఇప్పటివరకు  తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనే డబ్బింగ్ చెప్పిన రష్మిక.. ఈ సినిమా కోసం మొదటి సారి మలయాళంలో డబ్బింగ్ చెప్పిందని పోస్ట్ చేసింది. దీనికి ఆమె ఫ్యాన్స్  ‘రష్మిక డెడికేషన్ అంటే ఇది’ అంటూ రీ ట్వీట్‌‌‌‌లు చేస్తున్నారు. మరోవైపు రష్మిక  ‘పుష్ప2’ చిత్రాన్ని కూడా పూర్తి చేసే పనిలో ఉంది.  ఇందులో  పుష్పరాజ్‌‌‌‌ (అల్లు అర్జున్‌‌‌‌) భార్యగా శ్రీవల్లి పాత్రలో ఆమె కనిపించనుంది.  ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే  ‘రెయిన్ బో’ చిత్రంలో లీడ్‌‌‌‌గా నటిస్తోంది. ఇక  హిందీలో ‘ఛవా’ చిత్రంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులతో ఆమె  బిజీగా ఉంది.