ఔట్​సోర్సింగ్ ​కార్యదర్శుల పోస్టులు కొనసాగింపు

ఔట్​సోర్సింగ్ ​కార్యదర్శుల పోస్టులు కొనసాగింపు
  • మరో ఏడాదిపాటు  పొడిగిస్తూ పంచాయతీ రాజ్​ శాఖ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్ విధానంలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్యదర్శులను మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించి శుక్రవారం పంచాయతీ రాజ్​శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా1,109 మంది కార్యదర్శులు పంచాయతీల్లో ఔట్​సోర్సింగ్​పద్ధతిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం వీరికి రూ.19,500 వేతనంగా చెల్లిస్తున్నది. రెగ్యులర్​ కార్యదర్శుల జాబ్ చార్టే వీరికి అమలవుతోంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించడం, ఇంటి, నల్లా పన్నులు వసూలు చేయడం వంటి పనులను కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నారు.