బీపీ, షుగర్ పేషెంట్లకు ఇంటికే మెడిసిన్

బీపీ, షుగర్ పేషెంట్లకు ఇంటికే మెడిసిన్

నెలకోసారి పంపిణీకి రాష్ట్ర సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీపీ, షుగర్ రోగులకు వాళ్ల ఇండ్ల వద్దకే వెళ్లి మెడిసిన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశలు, ఏఎన్‌‌‌‌ఎంల ద్వారా ఈ మందుల పంపిణీ చేపట్టనున్నారు. నెలకోసారి తమ పరిధిలో ఉన్న రోగుల ఇండ్ల వద్దకు వెళ్లి, అవసరమైన అన్ని మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన మెడిసిన్ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వాడుతున్నారా లేదా అనేదీ పరిశీలించి, సంబంధిత మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు రిపోర్ట్‌‌‌‌ చేయాలి. మెడికల్ ఆఫీసర్లు తమ పరిధిలోని పేషెంట్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి అవసరమైన టెస్టులు చేయించి, మెడిసిన్‌‌‌‌లో మార్పులను సూచించాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ఉంటే, స్పెషలిస్ట్​కు రిఫర్ చేయాలి. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీచేశామని ఆఫీసర్లు చెప్తున్నారు. 

మెడిసిన్ పంపిణీ కార్యక్రమం డిజిటలైజ్

మెడిసిన్ పంపిణీ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని మంత్రి హరీశ్‌‌‌‌రావు ఇప్పటికే అధికారులకు సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లకు అవసరమైన మందులను మెడికల్ కార్పొరేషన్‌‌‌‌(టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ) ద్వారా బల్క్‌‌‌‌గా కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు తమకు టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తొలుత సెంట్రల్ డ్రగ్‌‌‌‌ స్టోర్‌‌‌‌‌‌‌‌కు మందులు పంపిణీ చేస్తాయి. ఇక్కడి నుంచి టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ జిల్లాల్లోని డ్రగ్ స్టోర్లకు సప్లై చేస్తుంది. అక్కడి నుంచి హాస్పిటళ్లకు వెళ్తాయి. ఈ సిస్టమంతా ఇప్పటికే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఉంది. కొన్ని హాస్పిటళ్లలో ఏయే పేషెంట్‌‌‌‌కు మెడిసిన్ ఇస్తున్నారో కూడా ఫార్మసిస్టులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చేస్తున్నారు. ఈ పద్ధతిని అన్ని హాస్పిటళ్లకూ విస్తారించాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని, త్వరలోనే మందుల పంపిణీని పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. హాస్పిటల్‌‌‌‌లో ఏయే మెడిసిన్ అందుబాటులో ఉందో ఈ సిస్టమ్‌‌‌‌లో చూస్తే 
తెలిసిపోతుందన్నారు.