
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. అదనపు ఎస్పీలుగా విధులు చేపడుతున్న 18 మందికి ఎస్పీలుగా, మరో 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. 15 రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.