యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం

యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం

హైదరాబాద్,వెలుగు: వర్సిటీల్లోని నాన్ టీచింగ్ పోస్టుల రిక్రూట్మెంట్పై  సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై  ఆ పోస్టులను టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిసింది.  రాష్ట్రవ్యాప్తంగా15 యూనివర్సిటీల్లో 2,800 పోస్టులను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఆయా పోస్టులను గ్రూప్​4 ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. అయితే, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు గత నెల ఇచ్చిన జీవో 16 లో చెప్పారు. నెల రోజుల్లోనే సర్కారు తన నిర్ణయాన్ని వాపస్​ తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క యూనివర్సిటీల ద్వారానే నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని వీసీలు కోరుతున్నారు.