ఉత్తరాఖాండ్ లో ఉద్రిక్తత నలుగురు మృతి, 100మంది పోలీసులకు గాయాలు

ఉత్తరాఖాండ్ లో ఉద్రిక్తత నలుగురు మృతి, 100మంది పోలీసులకు గాయాలు

ఉత్తరాఖాండ్  రాష్ట్రంలోని బన్‌భూల్‌పురలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బంభూల్‌పురా పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమ కట్టడాలైన మసీదు, మదర్సాను గురువారం కూల్చి వేయడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు పెద్దఎత్తున నిరసనకు దిగగా.. హింస చెలరేగింది.  వారిని అదుపు చేయడానికి పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.

పోలీసులు, మున్సిపల్ అధికారులపై ఆంధోళనకారులు  రాళ్లు విసిరారు. పోలీసు అధికారులు షూటెండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా..  ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 100 మంది పోలీసులు గాయపడ్డారు. గాయ పడిన వారిలో అధికారులు, పోలీసులు, విలేఖరులు ఉన్నారు.

ఉద్రిక్తతకు కారణం..
బన్‌భూల్‌పుర ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా మదర్సాతోపాటు మసీదును నిర్మించారు. వాటిని తొలగించాలని గతంలో నిర్వాహకులకు నోటీసు ఇచ్చినా స్పందించలేదు. దీంతో గురువారం ఉన్నతాధికారులు కోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తు మధ్య మదర్సా, మసీదుల కూల్చివేతకు సిద్ధమయ్యారు. వారిని స్థానికులు అడ్డుకుని నిరసన తెలిపారు.

అయినప్పటికీ అధికారులు బుల్డోజర్ తో మదర్సాను కూల్చివేయించారు. దీంతో ఆందోళనకారులు వారిపై రాళ్లు విసిరి, వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీస్‌ స్టేషన్‌ను తగులబెట్టారు. దీంతో హల్ద్వానీ సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.  ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.