రేషన్‌ వద్దంటే పైసలెందుకు ఇయ్యరు?

రేషన్‌ వద్దంటే పైసలెందుకు ఇయ్యరు?

హైదరాబాద్, వెలుగు: రేషన్‌‌ తీసుకోలేదని నెలకు ఇవ్వాల్సిన రూ. 1,500ను నిలిపేయడాన్ని సవాల్‌‌ చేసిన కేసులో హైకోర్టు మరోసారి సర్కారుపై మండిపడింది. బియ్యం తీసుకోకున్నా తెల్ల రేషన్‌‌ కార్డున్న వాళ్లందరికీ పైసలివ్వాలని గతంలో తామిచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. కరోనా వల్ల పనుల్లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆర్థిక సాయం అందించకపోతే ఎట్లాగని ప్రశ్నించింది. లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో బియ్యం తీసుకోని 8.5 లక్షల మందికి బియ్యం, నగదు ఇవ్వొద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌‌ చేసిన పిల్‌‌పై మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఉత్తర్వులతో ఏకీభవించని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌‌ చేసిందని కోర్టుకు ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ చెప్పారు. దీనిపై ధర్మాసనం సీరియస్‌‌ అయింది. ‘బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు తీసుకోకపోతే ఆర్థిక సాయం ఇవ్వొద్దనే రూల్‌‌ చట్టంలో ఉందా? బియ్యం వద్దంటే పైసలు కూడా వద్దని కాదుగా? ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుపై లేదా’ అని కోర్టు ప్రశ్నించింది. అప్పీల్‌‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వనంతవరకు తమ ఆదేశాలను అమలు చేయాలని తేల్చి చెప్పింది. వివరాలను ఈ నెల 22న జరిగే విచారణలో చెప్పాలని ఆదేశించింది.

పండ్ల రైతులకు సాయం ప్రతిపాదన ఉందా?

లాక్‌‌డౌన్‌‌ వల్ల ఇక్కట్లు పడుతున్న పండ్ల రైతులకు సాయం అందించే ప్రతిపాదన ఏమైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయ రంగం ఎంతో కీలకమైనదని, దీనిపై ప్రభుత్వానికి ఓ పాలసీ ఉండాలని కామెంట్ చేసింది. లాక్ డౌన్ టైమ్ లో పండ్ల రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ వేసిన పిల్ పై  చీఫ్  జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పంటల సాగు, విస్తీర్ణం, దిగుబడి వంటి వివరాలతోపాటు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి విపత్తులు వస్తే వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఓ విధానం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది.

మాస్కులు,శానిటైజర్ల కొనుగోళ్లలో అవకతవకలు!