వచ్చే శతాబ్దంలోనైనా  డిపాజిట్​ చెల్లిస్తారా?

వచ్చే శతాబ్దంలోనైనా  డిపాజిట్​ చెల్లిస్తారా?

జూరాల ప్రాజెక్టు భూసేకరణ పరిహారంపై హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్ర సర్కార్‌‌‌‌ హామీ ఇస్తుంది. అమలు చేయదు. ఎందుకు చేయలేదంటే కరోనా సాకు చూపిస్తుంది. ప్రభుత్వానికే కరోనా కష్టముంటే.. భూమి కోల్పోయిన రైతులకు ఇంకెంత కష్టం ఉంటుందో తెలియదా? ఏడాదిన్నరగా జూరాల ప్రాజెక్టు భూసేకరణ కేసులో సగం పరిహారం డిపాజిట్‌‌‌‌ చేయాలని చెబితే ఎందుకు చేయలే దు. వచ్చే శతాబ్దంలోనైనా డిపాజిట్‌‌‌‌ చెల్లిస్తారా?’’అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే లాస్ట్​ చాన్స్​ అని, కింది కోర్టు నిర్ణయించిన సొమ్ములో సగం మొత్తాన్ని రెండు వారాల్లోగా డిపాజిట్‌‌‌‌ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌ రామచందర్‌‌‌‌రావు, జస్టిస్‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌ల బెంచ్‌‌‌‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.