
హైదరాబాద్, వెలుగు: కోట్లాది రూపాయలవిలువైన భూముల్ని పప్పుబెల్లాల మాదిరిగా ఇష్టానుసారం కేటాయిస్తే ఎట్లా అని హైకోర్టు కామెంట్ చేసింది. ఖరీదైన భూములను చౌకగా ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన పాలకులు ఇలా ఎందుకు చేస్తున్నారని సందేహం వ్యక్తం చేసింది.ఇటీవలి కాలంలో ప్రభుత్వం పలువురికి చౌకగా భూములు కేటాయించడాన్ని సవాల్ చేసిన కేసులన్నింటినీ కలిపి విచారిస్తామని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం ప్రకటించింది. ఈ కేసులన్నింటిలో మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్య దర్శిని ప్రతివాదిగా చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. భూ కేటాయింపు కేసులవిచారణను రెండు వారాలు వాయిదా వేసింది.రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోఖిలిగ్రామంలోని సర్వే నెం.96లో 5 ఎకరాలను సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది జూన్ 21న జీవో జారీ చేసింది. దీనిపై కరీంనగర్ జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన జె.శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యంత విలువైన భూమిని ప్రభుత్వం కారు చౌకగా కేటాయించిందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం అక్కడ గజం ధర రూ.8 వేలు కాగామార్కెట్ ధర రూ.40 వేలని చెప్పారు. ఎకరం విలువ రూ.4 కోట్లు కాగా.. ప్రభుత్వం మాత్రం ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించిందని,ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడమేనని ఆరోపించారు. పిల్‌ను విచారించినజస్టిస్ చౌహాన్ బెంచ్ .. ఓఆర్ఆర్ సమీపంలోనిభూముల విలువపై తమకు అవగాహన ఉందని కామెంట్ చేసింది. నివాస ప్రాంతంలో ఖరీదైన భూమిని డైరెక్టర్‌కు ఎందుకు ఇచ్చారనే దానిపై విచారణ చేయాలని అభిప్రాయపడింది.