బిగ్ బాస్­-3 పై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు

బిగ్ బాస్­-3 పై జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు
  • ట్రాయ్ కు ఫిర్యాదు చేయాలని పిటిషనర్ కు సూచన

హైదరాబాద్, వెలుగు: బిగ్‌‌ బాస్‌‌-3 ప్రసారాల విషయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. బిగ్‌‌బాస్‌‌ -3ని అడ్డుకోవాలని సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ సోమవారం విచారించింది. టీవీ ప్రసారాల వ్యవహారాలపై అభ్యంతరాలు ఉంటే ట్రాయ్‌‌కు ఫిర్యాదు చేసుకోవచ్చని పిటిషనర్ కు సూచించింది. పిల్లలు చూడటానికి వీల్లేని విధంగా సెన్సార్‌‌ లేకుండా బిగ్‌‌బాస్‌‌ ఉంటోందని పిటిషనర్ తరపున లాయర్‌‌ చెప్పారు. పిల్లలు చూడకుండా చూసే బాధ్యత వాళ్ల తల్లిదండ్రులదేనని బెంచ్ పేర్కొంది. దసరా తర్వాత తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది.