తుది ఉత్తర్వులకు లోబడే జిల్లాల్లో అడ్వకేట్ల నియామకం: హైకోర్టు

తుది ఉత్తర్వులకు లోబడే జిల్లాల్లో అడ్వకేట్ల నియామకం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: జిల్లా కోర్టుల్లో ప్రభుత్వ న్యాయవాదుల నియామకం తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్‌‌  కౌన్సిళ్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 354ను ఎన్‌‌ .అంజయ్య మరో 20 మంది హైకోర్టులో  సవాల్ చేశారు. 

మూడేండ్ల పదవీ కాలం పూర్తికాకుండానే తొలగింపు ఉత్తర్వులు జారీ చేశారన్నారు.  ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌  జనరల్‌‌ వాదనలు వినిపిస్తూ.. తొలగింపు ఉత్తర్వులు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి  ఉందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామంటూ హియరింగ్ ను 22వ తేదీకి  వాయిదా వేశారు.