20 బంతుల్లో ఒకే ఒక్క పరుగు, 3 వికెట్లు.. తొలి మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలు

20 బంతుల్లో ఒకే ఒక్క పరుగు, 3 వికెట్లు.. తొలి మ్యాచ్‌లోనే రికార్డులు బద్దలు

ఇంగ్లండ్ గడ్డపై జరుగుతోన్న ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌లో ఆసీస్ యువ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ సంచలన గణాంకాలు నమోదు చేశాడు. ఓవల్ ఇన్విన్సిబుల్ తరఫున బరిలోకి దిగిన జాన్సన్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 20 బంతులేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటం గమనార్హం.

ప్రత్యర్థి ఆటగాళ్లు బచ్చాగాళ్లు కాదు

20 బంతుల్లో 19 డాట్ బాల్స్ అనగానే.. అందరూ ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన బ్యాటర్లు లేకపోవచ్చనే అందరూ అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ వంటి విధ్వంసకర బ్యాటర్లను జాన్సన్ పెవిలియన్ చేర్చాడు. డెబ్యూ మ్యాచ్ అన్న భయం అతనిలో కాసింతైనా కనిపించలేదు. పదునైన బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

తొలి 5 బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వని జాన్సన్.. రెండోసారి వేసిన 5 బంతుల్లో సింగిల్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 10 బంతులు వేసినఆ అతడు 3 వికెట్లు పడగొట్టగాడు. అందులో రెండు బౌల్డ్‌లే ఉండటం గమనార్హం. హండ్రెడ్ లీగ్‌ టోర్నీ చరిత్రలో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా జాన్సన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్ జట్టు 100 బంతుల్లో 186 పరుగులు చేయగా.. మాంచెస్టర్ జట్టు 92 పరుగులకే కుప్పకూలింది.