అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త

అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త

అక్రమ సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు అనే వ్యక్తిని పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. రెండు సంవత్సరాల క్రితం  దంపతులు జీవనోపాధికోసం నగరానికి వచ్చారు. గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో ఉంటూ.. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. పనుల నిమిత్తం వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్ద కూలికి వెళ్తుండేవారు. ఈ క్రమంలో సువర్ణ పనిచేసే చోట ఓ వ్యక్తిత్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన భర్త రాజు పలుమార్లు సువర్ణను హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా సువర్ణలో మార్పు రాలేదు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికిలోనైన రాజు.. కోపంలో పార కర్రతో భార్య తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సువర్ణ బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. నిందితుడు రాజుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.