ప్రీమియం పెరుగుదల ఇబ్బందే.. సర్వేలో వెల్లడి

ప్రీమియం పెరుగుదల ఇబ్బందే.. సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: లైఫ్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం పెరుగుదల ఇబ్బందేనని కన్జూమర్లు చెబుతున్నారు. దీనివల్ల ఎఫర్డబిలిటీ సమస్య అవుతుందని పేర్కొంటున్నారు. లైఫ్​ఇన్సూరెన్స్​ పాలసీ కొనుగోలను సాధారణంగా మూడు అంశాలు ప్రభావితం చేస్తున్నాయని ఒక సర్వే రిపోర్టు తెలిపింది. లైఫ్​ ఇన్సూరెన్స్​ఎంత అవసరం అనేది వీటిలో మొదటిది కాగా, ఆర్థికంగా తట్టుకోగలగడం రెండో అంశమని, కొనుగోలులో ఎదుర్కొనే కష్టాలు మూడో అంశమని ఆ సర్వే రిపోర్టు వివరించింది. హన్స రీసెర్చ్​ ఈ సర్వేను నిర్వహించింది. దేశంలోని 3,300 కి  పైగా పాలసీ హోల్డర్లు సర్వేలో భాగం పంచుకున్నారు.

పాలసీ హోల్డర్లుగా వారి అనుభవాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను ఈ సర్వేలో వేసినట్లు వివరించింది.  ఇన్సూరెన్స్​ కంపెనీలు తమతో టచ్​లో ఉండవని 22 శాతం మంది  పాలసీ హోల్డర్లు ఈ సర్వేలో చెప్పడం గమనించదగ్గది. ఈ కారణంగానే కంపెనీలు మార్చుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. పాలసీ కొనుగోలు చేశాక బ్యాంకుల రిలేషన్​షిప్​ మేనేజర్లు లేదా ఏజంట్​ ఆరు నెలలకు ఒకసారయినా తమతో మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని పాలసీ హోల్డర్లు వ్యక్తం చేస్తున్నారు.