
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ – FIH ఉమెన్స్ సిరీస్ ఫైనల్స్ గెలిచి గోల్డ్ మెడల్ కొట్టింది భారత అమ్మాయిల హాకీ జట్టు. హిరోషిమా హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్స్ లో ఆతిథ్య జపాన్ ను 3-1 తేడాతో ఓడించింది. ఇండియా ఉమెన్ హాకీ టీమ్ కొత్త చరిత్ర సృష్టించింది.
టోర్నీలో బెస్ట్ ప్లేయర్ గా నిలిచిన స్కిప్పర్ రాణి రాంపాల్.. మూడో నిమిషంలోనే గోల్ కొట్టింది. తర్వాత జపాన్ దాన్ని సరిచేసింది. ఐతే… టోర్నీలో టాప్ స్కోరర్ అయిన గుర్జిత్ కౌర్… 45, 60 వ నిమిషాల్లో రెండు గోల్స్ చేసింది. తిరుగులేని ఆధిపత్యంతో ఫైనల్స్ నెగ్గింది.
FIH ఒలింపిక్ క్వాలిఫయర్స్ కు అర్హత సాధించిన ఒక్కరోజులోనే ఉమెన్స్ సిరీస్ ఫైనల్స్ కూడా నెగ్గింది భారత మహిళల జట్టు. ఉమెన్ టీమ్ కు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శుభాకాంక్షలు చెప్పారు.